Jayalalitha: తప్పని పరిస్థితుల్లో కొందరికి లొంగిపోయాను.. శరత్ బాబు‌తో బిడ్డను కనాలనుకున్నా: సినీ నటి జయలలిత

Jayalalitha sensational comments on Sharath Babu
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ పరిశ్రమలో సీనియన్ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె... ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు, తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను ఆమె తన తాజా ఇంటర్వ్యూలో వివరించారు. 

తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాను హైదరాబాద్ కు వచ్చానని... వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండిపోయానని జయలలిత చెప్పారు. తాను ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశానని.... ఒక రోజు డైరెక్టర్ గదికి రమ్మని పిలిచాడని, లేదంటే సినిమా నుంచి తీసేస్తానని హెచ్చరించాడని తెలిపారు. తాను ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుంచి తీసేశారని చెప్పారు. 

ఆ తర్వాత కూడా కొందరు తన వెంట పడేవారని... కొన్నిసార్లు తప్పించుకునే దాన్నని, కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో లొంగిపోయేదాన్నని జయలలిత షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తాను చెడిపోయినా పర్వాలేదని, ఇంట్లో వాళ్లు బాగుండాలనే అలా చేశానని చెప్పారు. అయితే, అందరూ వాళ్ల అవసరాలు తీర్చుకున్నారే కానీ, తన మీద ప్రేమను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

శరత్ బాబు, తాను ప్రేమించుకున్నామని... పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని జయలలిత తెలిపారు. ఆయనను తాను బావ అని పిలిచేదాన్నని చెప్పారు. బిడ్డను కనాలని ప్లాన్ కూడా చేసుకున్నామని తెలిపారు. అయితే, తమ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని... ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు కాబట్టే చెపుతున్నానని అన్నారు.
Go Back to Shorts
Jayalalitha
Tollywood
Sharath Babu
Love

More Telugu News