జనసేనానికి హరిరామ జోగయ్య మరో లేఖ.. ఈసారి ఏకంగా అభ్యర్థుల ఎంపికతో లేఖ!
- రెండో జాబితాలో ఉమ్మడి అభ్యర్థులను ఎంపిక చేసిన హరిరామజోగయ్య
- బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- రాయలసీమలో 20లక్షల మంది వరకు బలిజ సామాజికవర్గ ఓటర్లు ఉన్నారని వెల్లడి
ఇక జనసేనానికి రాసిన లేఖలో హరిరామ జోగయ్య తెలిపిన ఉమ్మడి అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట నుంచి ఎంవీ రావు, అనంతపురం నుంచి టీసీ వరుణ్, పుట్టపర్తి నుంచి బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లి నుంచి కొండా నరేంద్ర, గుంతకల్లు నుంచి మణికంఠకు టికెట్ కేటాయించాలని ఆయన తన లేఖ ద్వారా పవన్ కల్యాణ్‌ను కోరారు. తనకు ఉన్న రాజకీయ అనుభవంతో ముందస్తు అంచనాలను వేస్తున్నట్లు ఈ లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు.