Advertisement

అమరావతిలో రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ ను రెట్టింపు చేసిన ప్రభుత్వం.. ఉత్తర్వుల జారీ!

Key orders issued by AP Govt on Friday
  • రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల
  • మొత్తం రూ.21.98 కోట్లు విడుదల
రాజధాని అమరావతిలో రైతు కూలీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా వారికి అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
AP Govt
Amaravati
YS Jagan
Andhra Pradesh

More Telugu News