ఉత్కంఠను రేపుతున్న 'గామి' ట్రైలర్!
- విష్వక్ ఇమేజ్ కి భిన్నంగా రూపొందిన 'గామి'
- అఘోరగా కనిపించనున్న విష్వక్
- హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుకున్న సినిమా
- మార్చి 8వ తేదీన విడుదల
హీరో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అతను ఆ సమస్య నుంచి బయట పడటానికీ, 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధం ఉంటుంది. ఆ పనిపైనే అక్కడికి కథానాయకుడు బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనేదే కథ. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో విష్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా కాశీలోను .. హిమాలయాల్లోను చిత్రీకరణ జరుపుకుంది. కీలకమైన పాత్రలలో చాందినీ చౌదరి - అభినయ కనిపించనున్నారు. నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.