నాజూకుదనానికే పాఠాలు నేర్పే సౌందర్యం .. నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాజూకుదనానికే పాఠాలు నేర్పే సౌందర్యం .. నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్!

Neha Shettty Special
  • 'మెహబూబా'తో ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి
  • గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన బ్యూటీ  
  • 'డీజే టిల్లు' సినిమాతో దక్కిన పెద్ద హిట్ 
  • యూత్ లో పెరుగుతూ పోతున్న క్రేజ్
ఒకప్పుడు తమిళ .. మలయాళ ప్రాంతాల నుంచి టాలీవుడ్ కి వచ్చే బ్యూటీలు ఎక్కువగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో కన్నడ భామల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటోంది. అలా కన్నడ నుంచి ఇక్కడికి వచ్చిన మరో అందాల మందారమే నేహా శెట్టి. 2016లో ఓ కన్నడ సినిమాతోనే హీరోయిన్ గా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.ఆకాశ్ పూరి జోడీగా ఆమె 'మెహబూబా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'డీజే టిల్లు' సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 'రాధిక'గా ఆమె పోషించిన పాత్రను ఆడియన్స్ ఇంతవరకూ మరిచిపోలేదు. హీరోను మోసం చేసే ఈ పాత్రలో ఆమె సహజమైన నటన .. ఆ పాత్రలోని ఆమె గ్లామర్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయింది. నేహా శెట్టి మంచి మేనిఛాయతో దానిమ్మ మొగ్గలా కనిపిస్తుంది. కలువ రేకుల వంటి కళ్లతో తామర రేకులా కనిపిస్తుంది. పూతరేకుకి పుత్తడి అద్దినట్టుగా అనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్ లలోనే కాదు, చీరకట్టులోను ఈ సుందరి ఓ సౌందర్య స్వప్నమనే భావన కలిగిస్తుంది. 'పూల రెక్కలు .. కొన్ని తేనె చుక్కలు' అంటూ సిరివెన్నెల రాసిన ఒక పాటను గుర్తుకు తెస్తుంది. అందువల్లనేనేమో ఈ బ్యూటీ అభుమానుల జాబితాలో కుర్రాళ్లంతా పొలోమంటూ చేరిపోతున్నారు.
Advertisement
Neha Shetty
Actress
Tollywood

More Telugu News