బీహార్‌లో కాంగ్రెస్‌కు షాక్, బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
- ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిక
- అధికార పార్టీ వైపు కూర్చున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
- లోక్ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో మహాఘట్‌బంధన్‌కు వరుస షాక్ లు
బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మురారి ప్రసాద్ గౌతమ్, సిద్ధార్థ్ సౌరవ్ కాగా, ఆర్జేడీ నుంచి సంగీత కుమారి ఉన్నారు. వీరు ముగ్గురు లంచ్ అనంతరం బీజేపీ నేత ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పక్కన నడుస్తూ బీహార్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అంతేకాదు వారు అధికార పార్టీ వైపు కూర్చోవడంతో కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు షాక్‌కు గురయ్యారు.