'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'
- ఈ నెల 2న విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథాకథనాలు
- థియేటర్స్ నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్
- మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ సెంటర్ కి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా'వారు దక్కించుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేశారు.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఊరు మధ్యలో సెలూన్ షాప్ .. బ్యాండుమేళం నిర్వహించే హీరో, ప్రెసిడెంట్ చెల్లెలిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా అతనిని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలిసిన ప్రెసిడెంట్, హీరోపై కోపంతో అతని అక్కను టార్గెట్ చేస్తాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడు? అనేదే కథ. ఆసక్తికరంగా నడిచే ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.