అమెరికాలో తెలంగాణ యువకుడి హఠాన్మరణం
Advertisement

అమెరికాలో తెలంగాణ యువకుడి హఠాన్మరణం

Telangana youth dies of brain stroke in usa
  • ఇటీవలే అమెరికాలో ఎమ్ఎస్ పూర్తి చేసిన సికింద్రాబాద్ యువకుడు రుత్విక్‌రాజన్
  • స్నేహితులతో కలిసి బోజనం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే రుత్విక్ మృతిచెందాడన్న వైద్యులు
  • బ్రెయిన్‌స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచినట్టు వెల్లడి 
అమెరికాలో పైచదువులు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలంగాణ యువకుడు రుత్విక్ రాజన్ హఠాన్మరణం చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్దకుమారుడు బండా రుత్విక్‌రాజన్ (30) రెండేళ్ల క్రితం పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవల ఎమ్ఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న అతడు స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బ్రెయిన్‌స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబసభ్యులు అతడి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Advertisement
Telangana
USA
Secunderabad

More Telugu News