Advertisement

షర్మిల తనయుడి పెళ్లి రిసెప్షన్ కు ఖర్గే, శివకుమార్, రేవంత్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!

Congress top brass attends Sharmila son wedding reception
  • ఇటీవల షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం
  • రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో అంగరంగ వైభోగంగా పెళ్లి
  • హైదరాబాదులో పెళ్లి రిసెప్షన్
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేర్వేరుగా వివాహం జరిపించారు. 

కాగా, రాజారెడ్డి-అట్లూరి ప్రియల పెళ్లి రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జేడీ శీలం, మస్తాన్ వలి తదితరులు ఈ రిసెప్షన్ కు విచ్చేశారు. 

ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. ఈ వేడుకకు రాలేకపోయినా... వధూవరులను వారి వారి హృదయాల్లో నిలుపుకుని ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
YS Sharmila
Rajareddy
Priya
Wedding Reception
Congress
Andhra Pradesh

More Telugu News