కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ.. భయపెడుతున్న అధ్యయనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ.. భయపెడుతున్న అధ్యయనం

Suffering from heart and brain disorders Global study links COVID19 vaccines
  • 13 వైద్య సమస్యలను తీవ్రతరం చేసిన కరోనా వ్యాక్సిన్లు
  • 8 దేశాల్లో 99 మిలియన్ల మందిపై శాస్త్రవేత్తల అధ్యయనం
  • కరోనా టీకా తీసుకున్న వారిలో గుండె సంబంధిత సమస్యలు
కరోనా వైరస్ ప్రపంచంపై దాడిచేసి సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాలను ఇది బలితీసుకుంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కొవిడ్ భూతానికి కళ్లెం పడింది. అయితే, ఈ టీకాల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ‘వ్యాక్సిన్’ సైన్స్ జర్నల్ ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) పరిశోధనా విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్ పరిశోధకులు కొవిడ్-19 వ్యాక్సిన్లు ‘ప్రత్యేక ప్రతికూల సంఘటనలు’గా పరిగణించే 13 వైద్య సమస్యలను తీవ్రతరం చేసినట్టు గుర్తించారు. 

అర్జెంటినా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, స్కాట్‌లాండ్ దేశాల్లో కొవిడ్ టీకా తీసుకున్న 99 మిలియన్ల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న వారిలో హృదయ కండర వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ ముప్పును గుర్తించారు. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఎన్ఏ టీకాలే. ఈ టీకాలు ఒకటి, రెండు, మూడో డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను కనుగొన్నారు. రెండో మోతాదు తీసుకున్న తర్వాత అంచనా రేటుతో పోలిస్తే 6.1 రెట్లు ఎక్కువగా ఈ ముప్పు కనబడడం గమనార్హం.

ఆస్ట్రాజెనెకా టీకా మూడో డోసు తీసుకున్న తర్వాత గుండెకు సంబంధించిన మరో ముప్పు అయిన పెరికార్డిటిస్ ప్రమాదం 6.9 రెట్లు పెరిగినట్టు గుర్తించారు. అలాగే, మోడెర్నా టీకా మొదటి, నాలుగో మోతాదు తీసుకున్న వారిలో వరుసగా 1.7 రెట్లు, 2.6 రెట్లు ఈ ప్రమాదం పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. అలాగే, ఆస్ట్రాజెనెకా షాట్ తీసుకున్న వారు అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన గ్విలియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రక్తం గడ్డకట్టే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం తేల్చింది.

మోడెర్నా టీకా తీసుకున్న తర్వాత న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ వచ్చే ప్రమాదం 3.8 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత ఈ ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు నివేదించింది. కరోనా టీకా వల్ల కలిగే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
Advertisement
Covid Vaccine
Corona Virus
mRNA vaccines
WHO
Myocarditis
Pfizer-BioNTech
Moderna
AstraZeneca

More Telugu News