నేరుగా ఒటీటీకి వస్తున్న భయపెట్టే 'వళరి'
- రితికా సింగ్ తాజా చిత్రంగా 'వళరి'
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
- మార్చి 6 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ నుంచి రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమానే 'వళరి'. రితికా సింగ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆమె జోడీగా శ్రీరామ్ కనిపించనున్నాడు. మ్రితిక సంతోషిణి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా, థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ తెరపైకి వచ్చేస్తోంది.
మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా వదిలిన టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ముందు తమిళ ప్రాంతంలో 'వళరి' అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించేవారు. ఎంతో ఆయుధ సామాగ్రి ఉన్న ఆంగ్లేయులను భయపెట్టిన ఆయుధం ఇది. అలాంటి ఆయుధానికీ .. దెయ్యానికి ఉన్న సంబంధమేమిటనేదే కథ.