'పుష్ప 3'పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
- ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పుష్ప 2'
- 'పుష్ప 3' కచ్చితంగా ఉండొచ్చన్న బన్నీ
- ఈ చిత్రంపై తమకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని వెల్లడి
ఆగస్ట్ లో 'పుష్ప 2' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత అద్భుతంగా ఉంటుందని సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 'పుష్ప 3' కూడా రాబోతోందనే టాక్ నడుస్తోంది. దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు. 'పుష్ప 3' కచ్చితంగా ఉండొచ్చని తెలిపాడు. ఆ చిత్రానికి సంబంధించి తమకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు. బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కోసం జర్మనీకి బన్నీ వెళ్లాడు. 'పుష్ప 3'పై అక్కడే ఆయన క్లారిటీ ఇచ్చాడు.