ఓటుకు నోటు కేసులో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్ రెడ్డి
- ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయింది... రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోస్యం
- కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందని వ్యాఖ్య
కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డే అన్నారు. నిత్యం అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారిని పాథలాజికల్ లయ్యర్ అంటారని... రేవంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు. హరీశ్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.