కుర్చీ సంగతి తర్వాత... ముందు నీ నాలుక మడతపడకుండా చూసుకో: నారా లోకేశ్ కు అంబటి కౌంటర్

Ambati Rambabu counters Nara Lokesh comments
  • నువ్వు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీ మడతేస్తాం అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
  • టీడీపీ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక
  • 'ఇక్కడ ఉన్నది సింహాసనం... కుర్చీ కాదు మడతపెట్టడానికి' అంటూ అంబటి ట్వీట్
నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తానంటున్నావు... నువ్వు ఆ పని చేస్తే మేం కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఓ ఇనుప కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. "కుర్చీ సంగతి తర్వాత... ముందు నీ నాలుక మడతపడకుండా చూసుకో బాబూ లోకేశ్" అంటూ ట్వీట్ చేశారు. "ఇక్కడ ఉన్నది సింహాసనం... కుర్చీ కాదు మడతపెట్టడానికి" అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Ambati Rambabu
Nara Lokesh
Chair
Jagan
YSRCP
TDP
Janasena

More Telugu News