కదులుతున్న కారు నుంచి కాల్పులు.. అమెరికాలో ఐదుగురి మృతి
- ప్యూర్టో రికోలో దుండగుల కాల్పులు
- మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు
- డ్రగ్స్ రవాణాతో ముడిపడిన ఘటనగా అనుమానిస్తున్న పోలీసులు
కాల్పుల్లో చనిపోయిన ఓ 35 ఏళ్ల వ్యక్తిని డ్రగ్స్ వ్యాపారిగా అనుమానిస్తున్నామని, అతడిని లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇదిలావుంచితే.. ప్యూర్టో రికో ద్వీపంలో సాధారణంగా క్రైమ్ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే 74 హత్యలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలోనే సెయిబా పట్టణంలో డ్రగ్స్ సంబంధిత దాడి జరిగింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.