దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం నిజమే: కెనడా నిఘా సంస్థ తాజా నివేదిక
- భారత్‌తో పాటూ చైనా పేరునూ తన నివేదికలో ప్రస్తావించిన వైనం
- చైనాను అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
- రష్యాపై కూడా ఇదే తరహా ఆరోపణలు
కెనడా రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భారత్ జోక్యాన్ని అడ్డుకోకబోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నివేదిక ఆధారంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లోతైన దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు, చైనా జోక్యంపై నిఘా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. చైనాను అతిపెద్ద విదేశీ ముప్పుగా వర్ణించాయి. కెనడా రాజకీయాల్లో చైనా కార్యకలాపాల విస్తృతి, వినియోగిస్తున్న వనరుల దృష్ట్యా కమ్యునిస్టు దేశం తీరు ఆందోళనకరమని అభిప్రాయపడ్డాయి. కెనడాలోని అన్ని రంగాలు, అన్ని స్థాయుల్లో చైనా జోక్యం పెరిగిపోయిందని పేర్కొన్నాయి. ఈ నిఘా నివేదికలో భారత్‌తో పాటూ చైనా పేరును కూడా నేరుగా ప్రస్తావించాయి.