KTR: సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించిన కేటీఆర్... వీడియో ఇదిగో

KTR travels in Auto from Yusufguda to BRS bhavan
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయనను మరో ఆటోలో అనుసరించారు. కేటీఆర్ సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన ఆటో కార్మికుల ఇబ్బందులపై స్పందించారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం మంచిదేనని.. కానీ పథకాలు ప్రవేశపెట్టే సమయంలో అన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన పథకం మంచిదే అయినప్పటికీ దీని వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకంతో తమ పొట్ట కొట్టారంటూ ఆటో డ్రైవర్లు నిరసనలు చేపడుతున్నారని గుర్తు చేశారు. ఏదైనా పథకం పెడితే అనాలోచితంగా పెట్టవద్దని సూచించారు. బిల్డప్ కోసం పథకాలు పెడితే ఇలాంటి దుష్పరిణామాలు వస్తాయని హెచ్చరించారు.
Go Back to Shorts
KTR
BRS
Telangana
auto

More Telugu News