అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. ఫొటోను షేర్ చేసిన కేటీఆర్!
- ఎప్పుడూ క్లీన్ షేవ్ లో కనిపించే కేటీఆర్
- ఏఐ టెక్నాలజీతో కేటీఆర్ లుక్ మార్చిన అభిమాని
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
ఈ ఫొటోను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బీఆర్ఎస్ ను అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసిన తన ఫొటోను షేర్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. తాను జుట్టు, గడ్డం పెంచుకుంటే ఇలా ఉంటానని అన్నారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.