జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు... శిక్షించాలని కేటీఆర్ డిమాండ్
- మద్యం మత్తులో జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గోవింద్
- నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు
- నిందితుడిని కఠినంగా శిక్షించాలని డీజీపీకి కేటీఆర్ ట్వీట్
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం ఘటనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానో గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.