జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలి: గంటా శ్రీనివాసరావు

Ganta says Jagan should search his inner soul
విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నేడు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భీమిలి నుంచి జగన్ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారంట! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవని అన్నారు.

జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా లభించదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల బదిలీలు  ఎప్పుడూ చూడలేదని, జగన్ ఎంపీలకు కూడా అపాయింట్  మెంట్ ఇవ్వడంలేదని గంటా విమర్శించారు. దాంతో వైసీపీ నేతలు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. సగానికి సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలకు బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్రికెటర్ అంబటి రాయుడు ఏదో అనుకుని వైసీపీలోకి వెళ్లాడని, కానీ పరుగులు  చేయకుండానే బయటికి వచ్చేశాడని పేర్కొన్నారు.
Go Back to Shorts
Ganta Srinivasa Rao
Jagan
TDP
YSRCP
Sankranti
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News