జగన్ గారు అవకాశం ఇస్తే వైసీపీ తరఫున పోటీ చేస్తా: నటి శ్రీ రాపాక
- రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటి
- జగన్ అంటే తనకిష్టమంటున్న శ్రీ రాపాక
- చాన్స్ ఇస్తే గోపాలపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడి
తాను స్వతహాగా క్రీడాకారిణినని, ఖో ఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయి వరకు వెళ్లానని శ్రీ రాపాక వెల్లడించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లానని, సినిమా రంగంలో ప్రవేశించానని వెల్లడించారు.
ఇవాళ గుడికి వచ్చి జగన్ గారు మళ్లీ సీఎం కావాలని దేవుడ్ని కోరుకున్నానని శ్రీ రాపాక తెలిపారు. జగన్ గారు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో గోపాలపురం (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని మనసులో మాట వెల్లడించారు.
తాను కూడా అక్కడక్కడా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నానని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ గారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకే తాను కూడా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.