Manoj Bajpayee wife: నెట్ ఫ్లిక్స్ లో 'కిల్లర్ సూప్' వెబ్ సిరీస్!

Killer Soup Web Series Steaming date confirmed
షార్ట్స్‌లో చూడండి
ఇటు సినిమాల పరంగా .. అటు వెబ్ సిరీస్ ల పరంగా మనోజ్ బాజ్ పాయ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు విభిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. 'ఫ్యామిలీ మేన్' సిరీస్ తో తన కెరియర్ గ్రాఫ్ మరింత స్పీడ్ గా ముందుకు తీసుకుని వెళుతున్న ఆయన నుంచి మరిన్ని వెబ్ సిరీస్ లు రానున్నాయి. 

అలాంటి వెబ్ సిరీస్ లలో ఒకటిగా 'కిల్లర్ సూప్' కనిపిస్తోంది. మనోజ్ బాజ్ పాయ్ కథానాయకుడిగా .. కొంకణా సేన్ నాయికగా ఈ సిరీస్ నిర్మితమైంది. గతంలో డార్క్ క్రైమ్ కథలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మనోజ్ బాజ్ పాయ్ ద్విపాత్రాభినయం చేసిన సిరీస్ ఇది. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది. క్రైమ్ ... కామెడీ కలిసి నడిచే కథలా అనిపిస్తోంది. నాజర్ .. సాయాజీ షిండే .. లాల్ .. రాజీవ్ రవీంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Go Back to Shorts
Manoj Bajpayee wife
Konkana Sen
Laal
Killer Soup

More Telugu News