కాంగ్రెస్ లో షర్మిల చేరికపై క్లారిటీ ఇచ్చిన వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి
- షర్మిల గురువారం కాంగ్రెస్ లో చేరుతున్నారన్న దేవేందర్ రెడ్డి
- ఏఐసీసీలో ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని వెల్లడి
- పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య
మరోవైపు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పజెప్పనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కూడా షర్మిలతో కలిసి నడుస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.