గుండెపోటుతో డ్రైవింగ్ సీటులోనే కన్నుమూసిన డ్రైవర్.. హైదరాబాద్ లో ఘటన
- ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి బయలుదేరిన డ్రైవర్
- డివైడర్ పైకెక్కి ఆగిన కారు.. డ్రైవర్ ధనుంజయ మృతి
- చాంద్రాయణగుట్టలో విషాదం
నల్లవాగు సమీపంలోకి చేరుకున్న తర్వాత ధనుంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, కారును నియంత్రించలేకపోయాడు. దీంతో కారు డివైడర్ పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్ పై తలవాల్చేసి కనిపించాడు. స్థానికులతో కలిసి పోలీసులు ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే ధనుంజయ్ ప్రాణం పోయిందని వివరించారు.