Komati Jayaram: యశ్ అరెస్ట్ పై టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ఫైర్.. అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసనలకు పిలుపు

Komati Jayaram condemns Yash Bodduluri arrest and calls of protests in all cities across USA
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యశ్ అరెస్ట్ ను టీడీపీ కీలక ఎన్నారై నేత కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ చివరి వంద రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమోనని ఆశించామని... కానీ, తన వక్ర బుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని అన్నారు. యశ్ అక్రమ అరెస్ట్ ను అమెరికాలో ఉన్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. యశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Komati Jayaram
Yash Bodduluri
TDP NRI
USA
Protests

More Telugu News