నాకు ఇప్పటి వరకు ఓటమి తెలియదు... గజ్వేల్‌లో ఓడాక కసి మరింతగా పెరిగింది: ఈటల
- విద్యార్థి దశ నుంచీ తనకు ఓటమి అంటే తెలియదన్న ఈటల
- గజ్వేల్ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామన్న ఈటల
- గజ్వేల్‌లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా కేసీఆర్ గెలిచారని ఆరోపణ
డబ్బు, మద్యం పంచి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. ఇక్కడ నైతికంగా బీజేపీనే గెలిచిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదేకాదన్నారు. గజ్వేల్‌లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన గెలిచారని విమర్శించారు. ఈ ఓటమి తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు.