తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

prasad kumar unanimously elected as telangana assembly speaker
  • బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేసిన ప్రసాద్ కుమార్
  • ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం
  • స్పీకర్ ఎన్నికను ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ తన నామినేషన్ పత్రాలను శాసన సభ కార్యదర్శికి సమర్పించారు.

నామినేషన్ దాఖలు సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్... ప్రసాద్ కుమార్ నామినేషన్ ను ప్రతిపాదిస్తూ సంతకం చేశారు. గురువారం నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చేస్తారు.
Go Back to Shorts
prasad kumar
Telangana
Congress
speaker

More Telugu News