పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందన
- బీఆర్ఎస్ ను వీడుతున్నాననే వార్తల్లో నిజం లేదన్న సుధీర్ రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని వ్యాఖ్య
- కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల వైపు ఉండాలనే భావజాలంతో తాము పని చేస్తామని సుధీర్ రెడ్డి అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగైదు నెలల సమయం ఇస్తామని... ఈలోగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని విమర్శించారు.