నటుడు శివరాజ్ కుమార్‌కు డీకే శివకుమార్ బంపర్ ఆఫర్.. భార్య పేరును సూచించిన నటుడు!
- ఆర్యా ఈడిగ సమావేశంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, శివరాజ్ కుమార్
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించిన డిప్యూటీ సీఎం
- సున్నితంగా ఆఫర్ తిరస్కరించిన శివరాజ్ కుమార్
- తన భార్యకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.. ఆమెకు ఇచ్చే విషయమై పరిశీలించాలన్న శివరాజ్ కుమార్
డీకే ఆఫర్‌పై శివరాజ్ కుమార్ వేదిక మీద స్పందించలేదు. కానీ తర్వాత డీకే శివకుమార్‌తో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ముఖానికి రంగులేసుకొని నటించడం తన తండ్రి ఇచ్చిన బహుమతి అని, ప్రత్యక్ష రాజకీయాలకు తాము దూరమని, రాజకీయంగా తనకు ఉన్న ఏకైక బంధం తాను మాజీ సీఎం బంగారప్ప కూతురును పెళ్ళి చేసుకోవడమేనని, ఆమెకు మాత్రం రాజకీయాలపై ఆసక్తి ఉంది.. కాబట్టి ఆమెను ప్రోత్సహిస్తానని, మీరు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చునని చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.