బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల స్థలం, బంగారం కావాలన్న బాయ్ ఫ్రెండ్!... ఆత్మహత్య చేసుకున్న యువతి

Doctor commits suicide in Kerala
  • కేరళలో ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న డాక్టర్ షహానా
  • మరో డాక్టర్ తో ప్రేమ... పెళ్లి చేసుకోవాలని ఇరువురి నిర్ణయం
  • లాంఛనాలు ఇచ్చుకోలేమన్న షహానా కుటుంబ సభ్యులు
  • పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి తరఫు వారు
కేరళలో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పేరు షహానా. 26 ఏళ్ల షహానా తిరువనంతపురంలో కుటుంబంతో నివసిస్తోంది. ఆమెకు తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి రెండేళ్ల కిందట మరణించాడు. 

డాక్టర్ షహానా ప్రస్తుతం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ చేస్తోంది. ఆమె ఈఏ రువాయిస్ అనే మరో డాక్టర్ తో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

అయితే, అబ్బాయి తరఫు వారు ఈ పెళ్లి జరగాలంటే ఓ బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల స్థలం, భారీగా బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అంతటి లాంఛనాలు ఇచ్చుకోలేమని షహానా కుటుంబం స్పష్టం చేసింది. దాంతో ఈ పెళ్లిని వరుడు రువాయిస్ కుటుంబ సభ్యులు రద్దు చేశారు. 

ఈ పరిణామాలతో  తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్ షహానా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అపార్ట్ మెంట్ లో సూసైడ్ నోట్ లభ్యం కాగా, "ప్రతి ఒక్కరికీ డబ్బే ప్రధానం" అని రాసి ఉన్నట్టు గుర్తించారు. 

ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఈ కేసును దర్యాప్తు చేసి యువ వైద్యురాలి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కనుగొనాలని పోలీసులను ఆదేశించారు.
Advertisement
Dr Shahana
Dr Ruwais
Thiruvananthapuram
Suicide
Kerala

More Telugu News