టీమిండియాతో టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే!

South Africa team announced for test series with Team India
  • డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన
  • 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా
  • డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్
  • దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలకు చోటు
ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించగా... తాజాగా దక్షిణాఫ్రికా కూడా జట్టును ప్రకటించింది. 

ఈ సిరీస్ లో సఫారీ జట్టుకు టెంబా బవుమా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. యువ బ్యాట్స్ మన్ ట్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్స్ మన్ డేవిడ్ బెడింగ్ హామ్, ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ కూడా ఈ సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్ గడప తొక్కుతున్నారు.  

దక్షిణాఫ్రికా టెస్టు జట్టు...
టెంబా బవుమా (కెప్టెన్), డీన్ ఎల్గార్, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ బెడింగ్ హామ్, టోనీ డి జోర్జి, కీగన్ పీటర్సన్, కైల్ వెర్రీన్, ట్రిస్టాన్ స్టబ్స్, వియాన్ ముల్డర్, గెరాల్డ్ కోట్జీ, మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, కగిసో రబాడా, నాండ్రే బర్గర్. 

కాగా, టీమిండియాతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు కూడా దక్షిణాఫ్రికా జట్లను ప్రకటించారు. టీమిండియాతో వైట్ బాల్ సిరీస్ లకు టెంబా బవుమా, కగిసో రబాడాలకు విశ్రాంతి కల్పించారు. వీరిద్దరూ టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటారు. టీ20, వన్డే సిరీస్ ల్లో దక్షిణాఫ్రికా జట్లకు ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
Go Back to Shorts
South Africa
Team India
Test Series
Cricket

More Telugu News