Eesha Rebba: అందం .. ఆకర్షణ ఆమె సొంతం: ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్

Eesha Rebba Special
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలుగు ప్రాంతానికి చెందిన .. తెలుగు భాష వచ్చిన హీరోయిన్స్ మాత్రమే కనిపించేవారు. అందువలన తెలుగు కథలలో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉండేది. ఆ తరువాత కాలంలో తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ జోరు పెరుగుతూ పోయింది. ఒక దశ తరువాత తమిళ .. మలయాళ భామల రాక ఎక్కువైంది. అక్కడి హీరోయిన్స్ ఇక్కడ చక్రం తిప్పడం మొదలైంది. ఇప్పటికీ అదే పరిస్థితి నడుస్తోంది. ఇంత పోటీ ఉన్నప్పటికీ, తెలుగు తెరపై తమ జోరు చూపించాలనే ఉద్దేశంతో తెలుగు ప్రాంతాలకి చెందిన  కొంతమంది హీరోయిన్స్ గట్టిగానే ట్రై చేస్తూ వెళ్లారు. అలాంటివారి జాబితాలో అంజలి .. స్వాతి రెడ్డి .. ఆనంది .. బిందుమాధవి కనిపిస్తారు. అయితే వీళ్లంతా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో లోనే వరంగల్ కి చెందిన ఈషా రెబ్బా కూడా గట్టి పట్టుదలతోనే ముందుకు వెళుతోంది. అవకాశాలను సంపాదించుకుంటోంది. ఫొటో షూట్ లతో తన గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉంటుంది. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఉన్న ఈషా రెబ్బాకి సరైన హిట్ పడితే, దశ తిరిగే అవకాశాలు ఇప్పటికీ పుష్కలంగానే ఉన్నాయనే విషయం ఈ పిక్స్ చూస్తే అర్థమైపోవడం లేదూ!
Go Back to Shorts
Eesha Rebba
Actress
Tollywood

More Telugu News