Nandyal: నంద్యాలలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులకు శిరోముండనం!

Head shave for six Inter students involved in the clash In Nandyal
షార్ట్స్‌లో చూడండి
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఘర్షణ పడడం పట్ల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. విద్యార్థులను కర్రలతో దండించడంతోపాటు శిరోముండనం చేయించింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కాలేజీలో ఇంటర్ సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి పరస్పరం దాడి చేసుకున్నారని సమాచారం. 

అయితే ఈ ఘర్షణలో పాల్గొన్న విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. కాలేజీ సిబ్బంది విద్యార్థులను కర్రలతో తీవ్రంగా కొట్టారని, ఆరుగురికి శిరోముండనం చేయించారని సమాచారం. కాలేజీ సిబ్బంది దండించడంతో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని, ఒకరికి చెయ్యి విరిగిందని తెలుస్తోంది. ఈ వ్యవహారం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Go Back to Shorts
Nandyal
Inter students clash
Andhra Pradesh

More Telugu News