సెటిలర్స్ అనే మాట తీసేయాలి... ఇది మన గడ్డ... ఇక్కడే జీవిస్తున్నాం: హైదరాబాద్‌లో తుమ్మల
- ఎన్టీఆర్ ఆత్మగౌరవ రాజకీయాలు నేర్పితే చంద్రబాబు ఆత్మవిశ్వాస రాజకీయాలు నేర్పారన్న తుమ్మల
- చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలన్న తుమ్మల
ఐటీ టవర్లు.. ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వంటి వాటితో హైదరాబాద్ కు విశ్వనగరంగా చంద్రబాబు పునాది వేశారన్నారు. 2020 విజన్‌తో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కితాబునిచ్చారు.
రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటుతో సోనియాగాంధీ చరిత్రలో నిలిచారన్నారు. తెలంగాణలో దారుణమైన పాలన ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు మాఫియాగా మారారని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కాంగ్రెస్ మార్పును కోరుతోందన్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.