Advertisement

అటు ఫ్లాప్ .. ఇటు హిట్ .. శ్రీలీలకి ఇది కలిసొచ్చే అంశమే!

Sreeleela Special
  • వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల
  • 'ధమాకా'తో పెరిగిన జోరు 
  • నిరాశపరిచిన 'స్కంద' .. 'ఆదికేశవ'
  • బరిలోకి దిగనున్న  'ఎక్స్ ట్రా' .. 'గుంటూరు కారం'

శ్రీలీల ఇలా తన కెరియర్ ను మొదలుపెట్టిందో లేదో .. అలా దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఇంత జోరు చూపిస్తున్న హీరోయిన్ ను చూడలేదనే అభిప్రాయన్ని స్టార్ హీరోలే వ్యక్తం చేస్తున్నారు. 'ధమాకా' సినిమాతో శ్రీలీల భారీ విజయాన్ని అందుకుంది. యూత్ హృదయాలపై మరింత బలంగా తన పోస్టర్ వేసింది. 

అయితే ఆ తరువాత ఆమె చేసిన 'స్కంద' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రామ్ జోడీగా మెరవడంలో మెప్పించింది గానీ, కథాకథనాల పరంగా తేడా కొట్టేసింది. ఆ వెంటనే 'భగవంత్ కేసరి' వంటి భారీ హిట్ పడటం వలన, 'స్కంద' ఫ్లాప్ ను ఆడియన్స్ త్వరగా మరిచిపోయారు. అయితే 'భగవంత్ కేసరి' సక్సెస్ ను ఆమె ఎంజాయ్ చేస్తుండగానే, 'ఆదికేశవ' వచ్చిపడింది. 

వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ఈ సినిమాలో, ఆయన జోడీగా శ్రీలీల నటించింది. అయితే కథ రొటీన్ గా ఉండటంతో, ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఫలితంగా శ్రీలీలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే  డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి 'గుంటూరు కారం' రిలీజ్ ఉండనే ఉంది. ఇలా ఫ్లాపులను ఫాస్టుగా మరిపిస్తూ, కొత్త సినిమాలను థియేటర్స్ లో దింపేస్తుండటం కూడా కలిసొచ్చే అంశమే. 
Advertisement
Sreeleela
Ram
Nithin
Vaishnav
Mahesh Babu

More Telugu News