సెక్రటేరియట్ ముందు ప్రమాదకరంగా బైక్ స్టంట్.. బైకర్ కోసం పోలీసుల గాలింపు
- సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రమాదకర ఫీట్లు
- వైరల్ గా మారిన వీడియో.. మండిపడుతున్న నెటిజన్లు
- చర్యలు తీసుకోవాలంటూ వివరాలు ట్వీట్ చేసిన ఓ యూజర్
అర్ధరాత్రి సమయంలో ఖాళీగా ఉండే సిటీ రోడ్లపై బైక్ లతో ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం ఇటీవల పెరిగింది. సోషల్ మీడియా ఖాతాలలో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది యువకులు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. దీనివల్ల మిగతా వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజా ఘటనకు సంబంధించి వైరల్ గా మారిన వీడియోను నెటిజన్లు పోలీసులకు పంపిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లోని ట్రాఫిక్ విభాగం ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు బైక్ స్టంట్స్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.