గుజరాత్ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’.. ఒక్క చేప ధర ఏకంగా ఐదు లక్షలు!
- ప్రకటించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
- ఘోల్‌ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌కు విపరీతమైన డిమాండ్
- మాంసాన్ని బీర్, వైన్ తయారీకి.. బ్లాడర్‌ను ఔషధాల తయారీకి వాడకం
మాంసం, దాని ఎయిర్ బ్లాడర్ కారణంగా ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. బీర్, వైన్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అలాగే, దాని మూత్రపు తిత్తులు (ఎయిర్ బ్లాడర్)ను ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఘోల్ ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌ను వేర్వేరుగా విక్రయిస్తారు. ముంబై నుంచి ఎయిర్ బ్లాడర్ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది.
ఈ చేప పొడవు దాదాపు మీటరున్నర ఉంటుంది. పొడవును బట్టి ఒక్కో చేప ధర రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. ఇవి కనుక తమ వలలకు చిక్కాయంటే జాలర్లకు పండుగ అన్నట్టే.