గ్లెన్ మ్యాక్స్ వెల్ కు తన జెర్సీ అందించిన కోహ్లీ

Kohli presents his jersey to Glenn Maxwell
  • వరల్డ్ కప్ ఫైనల్ ముగిశాక మైదానంలో భావోద్వేగ సన్నివేశాలు
  • విరాట్ కోహ్లీని ఓదార్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్
  • ఫొటోలను పంచుకున్న ఐసీసీ
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగిశాక మైదానంలో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. 

టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వద్దకు వచ్చిన ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆత్మీయంగా మాట్లాడడం కనిపించింది. ఓటమి బాధలో ఉన్న కోహ్లీని ఓదార్చాడు. అంతేకాదు, కోహ్లీ నుంచి గుర్తుగా ఓ జెర్సీని కూడా తీసుకున్నాడు. ఈ ఎమోషనల్ మూమెంట్స్ ను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది. 

కోహ్లీ, మ్యాక్స్ వెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే. ఐపీఎల్ లో పలు జట్లకు ఆడిన మ్యాక్స్ వెల్ 2021 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుకు మారాక మ్యాక్స్ వెల్ ఆటతీరులో స్థిరత్వం కనిపిస్తోంది.
Go Back to Shorts
Virat Kohli
Glenn Maxwell
Jersey
Final
Word Cup
Team India
Australia

More Telugu News