త్రిషతో రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య
- ‘లియో’ చిత్రంలో నటించిన త్రిష, మన్సూర్ అలీ ఖాన్
- త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే ఆమెను కనీసం చూపించను కూడా లేదన్న మన్సూర్
- మన్సూర్‌పై మండిపడ్డ నటి, అతడు మానవజాతికే కళంకమని వ్యాఖ్య
- అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్
విజయ్, త్రిష కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన మూవీ ‘లియో’లో మన్సూర్ అలీ ఖాన్ ఓ పాత్ర పోషించాడు. సినిమా హిట్ అయిన నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా త్రిషను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తన నీచత్వాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడు. ‘‘నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూం సన్నివేశం ఉంటుందని అనుకున్నా. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్‌రూంలోకి తీసుకెళ్లొచ్చని భావించాను. నేను గతంలో చాలా సార్లు రేప్ సీన్లు చేశాను. ఇది నాకు కొత్తకాదు. అయితే, లియో కశ్మీర్ షెడ్యూల్ సెట్స్‌లో త్రిషను నాకు చూపించనే లేదు’’ అంటూ వెకిలి కామెంట్స్ చేశాడు.
దీనిపై త్రిష మండిపడింది. ‘‘మన్సూర్ అలీ ఖాన్ నాపై చెత్త వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను అతడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి కామెంట్స్‌లో స్త్రీలపై వివక్ష, ద్వేషం, పురుష దురహంకారం కనిపిస్తున్నాయి. ఇలాంటి చెత్త వ్యక్తితో ఎప్పటికీ నటించను’’ అని త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చింది.