Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Technical problem in TPCC chief Revanth Reddy helicopter
షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం రావడంతో టీపీసీసీ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రయాణం రద్దయింది. దీంతో రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి కామారెడ్డికి బయలుదేరారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు ఆయన మూడు సభలలో పాల్గొనవలసి ఉంది. రోడ్డు మార్గంలో రావడంతో సభలకు ఆయన ఆలస్యంగా వచ్చే అవకాశముంది. ఆయన తన సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana Assembly Election

More Telugu News