విరాట్‌ కోహ్లీపై కంగనా రనౌత్ ప్రశంసల వర్షం

kangana ranaut all praises for virat kohli
  • విరాట్ రికార్డుపై ఇన్‌స్టా వేదికగా కంగనా స్పందన
  • వ్యక్తిత్వం, సెల్ఫ్ వర్త్ ఉన్న గొప్ప వ్యక్తిగా అభివర్ణన 
  • సచిన్‌కు విరాట్ అభివాదం చేస్తున్న పొటోను షేర్ చేసిన నటి
క్రికెట్ చరిత్రలో 50 వన్డే సెంచరీలతో సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, సెల్ఫ్ వర్త్ ఉన్న వ్యక్తి కోహ్లీ అని ప్రశంసించింది. భావి తరాలు అతడు నడయాడిన భూమిని పూజించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అతడు పూర్తిగా అర్హుడని పేర్కొంది. సచిన్ రికార్డును అధిగమించాక క్రికెట్ దేవుడికి విరాట్ వందనం అర్పిస్తున్న దృశ్యాన్ని కూడా కంగనా ఇన్‌స్టాలో పంచుకుంది. 

అంతకుమునుపు, విరాట్ భార్య అనుష్క శర్మ కూడా భర్తను పొగుడుతూ ఇన్‌స్టా స్టోరీ పంచుకున్న విషయం తెలిసిందే. మనసులోనూ ఆటపైనా నిజాయతీగా ఉండే విరాట్ నిజమైన దేవుడి బిడ్డ అంటూ కితాబునిచ్చింది. అతడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినందుకు భగవంతుడికి దన్యవాదాలు చెప్పుకుంటున్నానని కూడా అనుష్క పేర్కొంది.
Advertisement
Kangana Ranaut
Virat Kohli
Cricket
Bollywood

More Telugu News