టీడీపీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా: తుమ్మల నాగేశ్వరరావు
- తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆరే అన్న తుమ్మల
- ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని వెల్లడి
- ఖమ్మం, పాలేరుపైనే కేసీఆర్ దృష్టి సారించారని విమర్శ
బీఆర్ఎస్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా ఆ పార్టీ తనను ఓడించిందని... అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తుమ్మల చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టేశారని... ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను ఓడించడంపై దృష్టి సారించారని విమర్శించారు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.