హామీగా ఉండి రూ. 5 లక్షలు నష్టపోయా: జబర్దస్త్ నటుడు వినోద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హామీగా ఉండి రూ. 5 లక్షలు నష్టపోయా: జబర్దస్త్ నటుడు వినోద్

Jabardast actor Vinod latest interview
  • జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వినోద్
  • తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్ నటులు సాయం చేశారని వెల్లడి
  • తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదన్న నటుడు
  • ఓ విషయంలో హామీగా ఉండి రూ. 5 లక్షలు నష్టపోయానని ఆవేదన
  • చేతబడి అనుమానంతో చాలా డబ్బులు ఖర్చు చేశానన్న వినోద్
జబర్దస్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టనష్టాలను ఏకరవు పెట్టాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ తనకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదని పేర్కొన్నాడు. తన అనారోగ్యం గురించి తెలుసుకుని వారే ముుందుకు వచ్చి సాయం అందించారన్నాడు.

తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి రోజా కూడా సాయానికి ముందుకొచ్చారని తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పాడు. ఈవెంట్స్ చేయడంతోపాటు త్వరలోనే జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని పేర్కొన్నాడు. తన ఆరోగ్యం బాగాలేకపోవడానికి చేతబడి కారణమని చాలామంది అనుమానం వ్యక్తం చేయడంతో దాని కోసం కూడా చాలా ఖర్చు చేశానని, మరోవైపు, ఆసుపత్రిలో ఖర్చులు కలిసి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైతే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించాడు. ఇంటి కోసం జరిగిన గొడవలో తన చేయి విరిగిందని వాపోయాడు. ఓ విషయంలో హామీగా ఉండడం ద్వారా రూ. 5 లక్షలు నష్టపోయానని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisement
Jabardasth
Vinod
Jabardasth Comedy Show

More Telugu News