మాదిగ ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: జవహర్
- మాదిగలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న జవహర్
- మాదిగ ప్రజా ప్రతినిధులు సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శ
- మాదిగలకు ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్
చంద్రబాబు హయాంలోనే మాదిగలకు మేలు జరిగిందని... వైసీపీ ప్రభత్వం వచ్చిన తర్వాత మాదిగలను పూర్తిగా గాలికొదిలేశారని జవహర్ మండిపడ్డారు. మాదిగల పరిస్థితి ఇంత దయనీయంగా ఎప్పుడూ లేదని చెప్పారు. మాదిగలకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగ ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.