పరుగెత్తుకెళ్లి నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- చివరి నిమిషంలో హడావుడిగా నామినేషన్ దాఖలు
- భారీ ర్యాలీ కారణంగా ముందుకు కదలని వాహనం
- ఆఖరి నిమిషంలో కార్యాలయానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి
నామినేషన్‌కు ముందు ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా గురువారమే నామినేషన్లు వేయడంతో ట్రాఫిక్ సమస్య అనివార్యమైంది. ఈ ప్రభావంతో రాజగోపాల్ రెడ్డి వాహనం సకాలంలో కార్యాలయానికి చేరుకోలేకపోయింది. ఫలితంగా రాజగోపాల్ రెడ్డి చివరి క్షణంలో హైరానా పడాల్సి వచ్చింది. కార్యాలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. రిటర్నింగ్ ఆఫీసుకు 500 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేస్తారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి పరుగెత్తాల్సి వచ్చింది. ఆయన వెంట సెక్యూరిటీ, ప్రధాన అనుచరులు సైతం పరిగెత్తడం మీడియా కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.