జేడీ చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేడీ చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు

JD Chakravarthy receives best actor award
  • సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న జేడీ చక్రవర్తి
  • 'దయా' వెబ్ సిరీస్ లో నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు
  • అవార్డును అందించిన ఓటీటీ ప్లే సంస్థ
విలక్షణమైన పాత్రలను పోషిస్తూ సినీ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశ వ్యాప్తంగా ఓటీటీ కంటెంట్ లో ఈ అవార్డులను ఇచ్చింది. దయా వెబ్ సిరీస్ కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను వారు అందుకున్నారు.
Advertisement
JD Chakravarthy
Tollywood
Best Actor
OTT Play

More Telugu News