శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా.. మీకోసం కంపెనీ అదిరిపోయే ఆఫర్ ఇదిగో!
- 2020 కన్నా ముందు మోడల్ ఫోన్ ను 5జీ ఫోన్ తో అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం
- కొత్త ఫోన్ పై భారీగా డిస్కౌంట్ కూడా అందిస్తున్న శాంసంగ్
- లాయల్టీ అప్ గ్రేడ్ కింద ‘అప్ గ్రేడ్ టు ఆసమ్’ పోగ్రామ్
పాత ఫోన్లను గెలాక్సీ ఏ14, ఏ23, ఏ34, ఏ54 మోడల్ ఫోన్లతో మార్చుకోవచ్చని శాంసంగ్ ప్రకటించింది. ఏ14 మోడల్ (4జీబీ 64 జీబీ) ధర ప్రస్తుతం రూ.18,449 కాగా ఈ ఆఫర్ లో రూ.14,499 లకే సొంతం చేసుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా రూ.28,990 లు గా ఉన్న గెలాక్సీ ఏ23 మోడల్ 5జీ ఫోన్ (6జీబీ 128 జీబీ) ఫోన్ ను కేవలం రూ.18,999 లకే అందిస్తామని, రూ.1,407 లతో నెలవారీ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని వెల్లడించింది. ఇక, ఏ34 (8జీబీ 128 జీబీ) మోడల్ ధర రూ.35,499 లు కాగా దీనిని కేవలం రూ.25,999 లకే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
శాంసంగ్ ఏ54 మోడల్ 5జీ (8జీబీ 128 జీబీ) ఫోన్ ను రూ.33,999లకే సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఈ మోడల్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.41,999 లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. మీ పాత ఫోన్ లో మై గెలాక్సీ యాప్ లో ఈ ఆఫర్ పూర్తి వివరాలు, అప్ గ్రేడ్ చేసుకునే విధానం సహా పూర్తి వివరాలు ఉంటాయని శాంసంగ్ కంపెనీ తెలిపింది.