Advertisement

ఆఫ్ఘనిస్థాన్ మరో సంచలనం సృష్టించేనా?... నేడు శ్రీలంకతో ఢీ

Afghanistan won the toss against Sri Lanka
  • వరల్డ్ కప్ లో నేడు శ్రీలంకతో ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
  • పూణేలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
  • టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను ఓడించిన ఆఫ్ఘన్ జట్టు
వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి అగ్రజట్లను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది. పెద్ద జట్లపై విజయాలతో ఆఫ్ఘన్ జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇవాళ శ్రీలంకతో పూణేలో జరిగే మ్యాచ్ లోనూ గెలుపు అందుకోవాలని ఆ జట్టు కృతనిశ్చయంతో ఉంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. 

కాగా, ఈ మ్యాచ్ కోసం యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కు విశ్రాంతి కల్పించారు. అతడి స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ జట్టులోకి వచ్చాడు. అటు శ్రీలంక జట్టు దుష్మంత చమీర, కరుణరత్నేలకు స్థానం కల్పించారు. సీనియర్ ఓపెనర్ కుశాల్ పెరీరాను తప్పించారు. 

శ్రీలంక 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ఏడో స్థానంలో ఉంది.
Advertisement
Afghanistan
Sri Lanka
Toss
Bowling
Pune
World Cup

More Telugu News