Advertisement

సెలబ్రేషన్ సాంగ్ తో 156వ సినిమాను మొదలెట్టిన మెగాస్టార్!

Chiranjeevi 156th movie launch
  • సెట్స్ పైకి వెళ్లిన మెగాస్టార్ 156వ సినిమా
  • ఫాంటసీ కంటెంట్ ను రెడీ చేసిన వశిష్ఠ 
  • కీరవాణి సాంగ్ రికార్డింగ్ తో పూజా కార్యక్రమాలు మొదలు 
  • యూవీ బ్యానర్ కి ఇది 14వ సినిమా
యూవీ క్రియేషన్స్ వారి బ్యానర్లో శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారనీ, ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా, ఈ విజయదశమి వేళ కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
 
గతంలో మాదిరిగా సాంగ్ రికార్డింగ్ తో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుకావడం విశేషం. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయనీ, ఒక బలమైన కథను వశిష్ఠ భుజాన వేసుకుని వస్తున్నాడని కీరవాణి అన్నారు. ఇలాంటి ఒక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఉందని గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. చిరంజీవి దంపతులతో పాటు, అల్లు అరవింద్ .. రాఘవేంద్రరావు .. వినాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూవీ క్రియేషన్స్ వారికి ఇది 14వ సినిమా. గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ ఫాంటసీ మూవీలో, ముగ్గురు కథానాయికలు కనియించనున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 

Advertisement
Chiranjeevi
Sri Vashishta
Keeravani

More Telugu News