BJP: 50 మందితో నేడు బీజేపీ తొలి జాబితా .. బీసీలకు పెద్దపీట!

BJP to release first list today with 50 candidates
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేడు ప్రకటించనుంది. మొత్తం 50 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అంతేకాదు, ఈ 50 మందిలో 20కిపైగా స్థానాల్లో బీసీలను బరిలోకి దింపుతున్నట్టు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విమర్శలు సంధించారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. మహిళల కోసమంటూ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారని, కానీ ఆ పార్టీ మాత్రం మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను పక్కనపెట్టేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. ఇక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ వ్యవహారాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.
Go Back to Shorts
BJP
Telangana Assembly Election
BJP First List
K Laxman

More Telugu News